కొత్త మండలంగా బండలింగాపూర్
ABN , First Publish Date - 2023-06-27T00:28:02+05:30 IST
జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్‌పల్లి మండలంలోని పది గ్రామాలతో మండలం ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 26:జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్‌పల్లి మండలంలోని పది గ్రామాలతో మండలం ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్, రాజేశ్వర్‌రావుపేట, రామచంద్రంపేట, విట్టంపేట, మెట్ల చిట్టాపూర్, జగ్గసాగర్, రామ లచ్చక్క పేట, రంగారావుపేట,ఆత్మకూర్ గ్రామాలను కలుపుతూ బండలింగాపూర్‌ను మండలం చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు వినతులు సమర్పించడానికి 15 రోజుల గడువు ఇచ్చారు.
హమీ నేరవెర్చిన సీఎం కేసీఆర్
జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ బండలింగాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. నేడు బండలింపూర్‌ను కొత్త మండలంగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.