బహుజన ఆశీర్వాద సభ సక్సెస్‌తో వణుకు పుట్టింది..
ABN , First Publish Date - 2023-11-06T23:26:43+05:30 IST
జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిం చిన బహుజన ఆశీర్వాద యాత్ర విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిందని బీఎస్పీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష అన్నారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 6: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిం చిన బహుజన ఆశీర్వాద యాత్ర విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిందని బీఎస్పీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో నిర్వహిం చిన మన ఊరు-మన ఉష కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్, కాం గ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ గురించి వివరించారు. బీఎస్పీ అధికా రంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ వీరి పాలనలో ప్రజలకు న్యాయం జరగ లేదన్నారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే ఎన్నో మార్పులు చేసి చూపిస్తా మన్నారు. ఆశీర్వాద సభను విజయవంతం చేసిన బహుజనులకు నాయ కులకు కార్యకర్తలకు దాసరి ఉష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.