Share News

బడుగుల పక్షపాతి బద్దం ఎల్లారెడ్డి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:24 AM

బడుగుల పక్షపాతి బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణం సీపీఐ జిల్లా కార్యాలయంలో, ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో బద్దం ఎల్లారెడ్డి వర్ధంతిని నిర్వహించారు.

బడుగుల పక్షపాతి బద్దం ఎల్లారెడ్డి
సిరిసిల్లలో బద్దం ఎల్లారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న చాడ వెంకటరెడ్డి

- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

సిరిసిల్ల టౌన్‌/ఇల్లంతకుంట డిసెంబరు 27: బడుగుల పక్షపాతి బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణం సీపీఐ జిల్లా కార్యాలయంలో, ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో బద్దం ఎల్లారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి చిత్రపటం వద్ద చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. భూస్వామి కుటుంబంలో పుట్టిన బద్దం ఎల్లారెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడ్డాడన్నారు. తెలంగాణలో వెట్టిచాకిరి, అయ్యా నీ బాంచెన్‌ కాలుమొక్తా అనే దురాగతంను పారద్రోలడానికి బద్దం ఎల్లారెడ్డి సామాజిక చైతన్యం కల్పించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సేనానిగా పోరాటాలు చేసి సంపదను పేదలకు పంచారని గుర్తు చేశారు. ప్రజా సేవకులు కనుమరుగు అవుతూ దేశంలో కార్పొరేట్‌ రాజకీయాలు సాగుతున్నాయని డబ్బు ఉన్నవారే ప్రజాప్రతినిఽధలు అవుతున్నారన్నారు. సీపీఐ చీలిపోయి చిక్కిపోయి ప్రస్తుతం అనేక ఆటుపోటులను ఎదుర్కొంటుందన్నారు. ఈ నేపధ్యంలో సీపీఐ పునారాభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందడుగు వేయాలన్నారు. వర్గాలు లేని సమాజాన్ని నిర్మించేది, వర్గరహిత సమాజానికి బాటలు వేసేది సీపీఐ మాత్రమే అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా పౌర హక్కులను కాలరాస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కెస్తున్నారని వారిపై రాజద్రోహం కేసులు పెడుతూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు కడారి రాములు, మంద సుదర్శన్‌, మీసం లక్ష్మన్‌, సోమ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:24 AM