అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు
ABN , First Publish Date - 2023-11-19T23:22:04+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలకు ఆకర్షితులై చాలామంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నార ని ధర్మపురి బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ధర్మారం,నవంబరు19: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలకు ఆకర్షితులై చాలామంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నార ని ధర్మపురి బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివా రం ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి ఎక్స్‌రోడ్డులోగల ఓ పంక్షన్‌హాల్ లో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు రాజమ్మ బీఆర్‌ఎస్‌లో చేరింది. ఆమెతో పాటు 200మంది మహిళలు కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నిరుపేద బడుగుబలహీన వర్గాల అభ్యున్న తికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్న నమ్మకంతో పార్టీలో చేరు తున్నారని చెప్పారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అనేకరకాల పథ కాలు అమలు చేసిందని ఆయన గర్తు చేశారు. మరోసారి బీఆర్‌ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి తీపుకురావడానికి కారు గుర్తుపై ఓటు వేయాల ని ఆయన అభ్యర్థించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహకార సంఘాల చైర్మన్ ముత్యాల బల రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పూస్కూరి పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్య క్షుడు జితేందర్‌రావు, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు పూస్కూరి రామారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.