Share News

పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-11-21T00:00:18+05:30 IST

ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
పరిశీలిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

గంభీరావుపేట, నవంబరు 20: ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. గంభీరావుపేట మండలంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలైన నాగంపేట, ముస్తాఫనగర్‌, కొత్తపల్లి, గంభీరావుపేట గ్రామాలను సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మక గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీస్‌ సిబ్బంది విసిబుల్‌గా ఉంటూ క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను నిరంతరం సందర్శించాలని, అక్కడి ప్రజలకు ఎన్ని కలపై అవగాహన కల్పించాలని అన్నారు. సమస్యాత్మక ప్రా ం తాల్లో ఎక్కువగా ఫ్లాగ్‌మార్చ్‌, రూట్‌మార్చ్‌, వాహనాల తని ఖీలు చేపట్టాలన్నారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సైమహేష్‌ ఉన్నారు.

ఫ గంభీరావుపేట మండలం పెద్దమ్మ చెక్‌పోస్ట్‌ను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్‌ను పరిశీలించారు. వాహనాల తనిఖీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సిరిసిల్ల కైరం : శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సిరిసిల్ల సబ్‌ డివిజన్‌ పరిధిలోని సెక్టార్‌ అధికారులు, రూట్‌ అధికారులు, ిసీఐలు, ఎస్సైలతో సోమవారం నిర్వహించిన సమీ క్షలో మాట్లాడారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ ఉదయ్‌ రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:00:20+05:30 IST