యావర్‌ రోడ్‌ విస్తరణపై సమాధానం చెప్పాలి

ABN , First Publish Date - 2023-01-10T00:46:37+05:30 IST

ఎన్నికల్లో లబ్ది పొందేందుకు యావర్‌ రోడ్‌ను విస్తరణ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, నాలుగేళ్లు అవుతున్నా పట్టించు కోరా అని మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు.

యావర్‌ రోడ్‌ విస్తరణపై సమాధానం చెప్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న విజయ లక్ష్మి

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు విజయ లక్ష్మి

జగిత్యాల టౌన్‌, జనవరి 9 :ఎన్నికల్లో లబ్ది పొందేందుకు యావర్‌ రోడ్‌ను విస్తరణ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, నాలుగేళ్లు అవుతున్నా పట్టించు కోరా అని మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో సోమ వా రం విజయలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నూతన మా స్టర్‌ ప్లాన్‌ను జగిత్యాల పట్టణంలోనే అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ముందు చూపుతో రైతులు తమ భూములపై హక్కులు కోల్పోకుండా స మస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకవెళ్లితే అధికార పాలక వర్గం విమర్శిం చడంపై మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్సీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో మాస్టర్‌ ప్లాన్‌ అమలుతో రైతులు తమ హక్కులు కోల్పోయే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు కోసం గ్రామ పం చాయితీలు తీర్మాణాలు ఇచ్చాయని చెబుతున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాట లు అర్ధర హితం అన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు మాస్టర్‌ ప్లాన్‌కు వ్య తిరేఖంగా ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకుంటున్నారని నిజం తెలుసు కుని మాట్లాడాలని హితవు పలికారు. జగిత్యాల మున్సిపాలిటీని దోచు కోవడ మే కొందరు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీపీసీ సీ సభ్యుబు గిరి నాగభూషణం, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, ప్లోర్‌ లీడర్‌ కల్లెపెల్లి దుర్గయ్య, నాయకులు గాజుల రాజేందర్‌, జీవన్‌, తిమ్మా పూర్‌ సర్పంచ్‌ మేరుగు రమ్య, సిరాజోద్దీన్‌ మన్సూర్‌, రమేష్‌ బాబు, యు వజ న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, ప్రదీప్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-10T00:46:39+05:30 IST