ఆకట్టుకున్న విద్యా శాఖ స్టాల్‌

ABN , First Publish Date - 2023-06-03T00:39:47+05:30 IST

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విద్యాశాఖ ఆవిష్కరణల స్టాల్‌ ఆకట్టుకుందని జిల్లా విద్యాశాఖ అధి కారి డి.మాధవి తెలిపారు.

ఆకట్టుకున్న విద్యా శాఖ స్టాల్‌

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 2 : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విద్యాశాఖ ఆవిష్కరణల స్టాల్‌ ఆకట్టుకుందని జిల్లా విద్యాశాఖ అధి కారి డి.మాధవి తెలిపారు. అవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ పరేడ్‌ మైదానం లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆవిష్కరణల స్టాల్స్‌ను చూప రులను విశేషంగా ఆకట్టుకున్నదని తెలిపారు. ఇందులో పలు ఉన్నత పాఠశాలల విద్యార్థుల ఎగ్జిబిట్స్‌తో పాటుగా యువ ఆవిష్కర్తలు పాల్గొని తాము రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు. అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చే సిన శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ తానిపర్తి భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన జపాన్‌కు ఎంపికైన డి.హర్షిత, ఎం.పూజ శ్రీలను పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ స్టాల్‌లో జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆవిష్కరణ స్టాల్‌లో పాల్గొన్న ఆవి ష్కర్తలను డీఈవో జిల్లా కలెక్టరేట్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి బి.రవినందన్‌రావు, విద్యార్థులు దాసరి.హర్షిత(జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాల, చందనాపూర్‌), ముస్త్యాల పూజశ్రీ(అల్ఫోర్స్‌ ఉన్నత పాఠశాల, సుల్తానాబాద్‌), జి.శివాని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల, ధర్మారం), బి.కృష్ణవేణి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కన్నాల, పాలకుర్తి), పి.అంజని సిద్ధార్ధ్‌ (టి.ఎస్‌.యం.ఎస్‌ ధర్మా రం), యువ ఆవిష్కర్తలు బి.భగత్‌ ప్రశాంత్‌ (గోదావరిఖని), జూపల్లి. సాయికిరణ్‌ రావు(బొంతకుంటపల్లి) గైడ్‌ టీచర్‌ సి.శివకృష్ణ, ఎం.నరేష్‌, హెచ్‌.ఎం కె.శ్రీనివాస్‌, రా జ్‌కుమార్‌, ఎం.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:39:47+05:30 IST