రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-01-26T00:15:28+05:30 IST

రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహిం చడా నికి జిల్లా కేంద్రంలో సర్వం సిద్ధం చేశారు.

రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వం సిద్ధం
రిహార్సల్స్‌ చేస్తున్న పోలీసులు

- ముస్తాబయిన సమీకృత కలెక్టరేట్‌

జగిత్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహిం చడా నికి జిల్లా కేంద్రంలో సర్వం సిద్ధం చేశారు. ఈనెల 26వ తేదిన జగిత్యాలలోని నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ చేతుల మీదుగా జాతీయ జెండావిష్కరణోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు అనుగుణగా కలెక్టరేట్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల గదులను ముస్తాబు చేశారు. దీంతో పాటు పట్టణంలోని జడ్పీ కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు రిప బ్లిక్‌ డే ఉత్సవాలకు సిద్ధం చేశారు. జాతీయ జెండావిష్కరణ అనంతరం కలె క్టర్‌ రవి ప్రసంగం జరగనుంది. ఈ సందర్బంగా పోలీసు సిబ్బంది గౌరవ వం దనం సమర్పణ, పాఠశాల, కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, ఇతర వ్యక్తులకు ప్రతిభా పురస్కరాలు అందించనున్నారు.

Updated Date - 2023-01-26T00:15:28+05:30 IST