Share News

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-11-21T23:36:09+05:30 IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత జరగాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

-కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత జరగాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ దత్తత నెల అవగాహన పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకొని పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని అన్నారు.

దత్తతతపై అవగాహన కల్పించే దిశగా ప్రతి సంవత్సరం నవంబర్‌ నెలలో దత్తత నెలగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ హోమ్స్‌లో ఉన్న పిల్లలందరిని గుర్తించి దత్తత ఇవ్వడం, దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు పిల్లల పోషణ గురించి, దత్తత తీసుకునే విధానం గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, సభ్యులు అర్చన విజయ్‌, డీసీపీవో శాంత, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, జిల్లా కో-ఆర్డినేటర్‌ సంపత్‌, పీఓఎన్‌ఐసీ తిరుపతి, ఎల్‌సీపీవో రాజు, శిశు గృహ సోషల్‌ వర్కర్‌ రాజేష్‌, సఖి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:36:13+05:30 IST