పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి

ABN , First Publish Date - 2023-09-18T00:43:38+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని, కారు గుర్తు కు ఓటు వేసి రామగుండంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని రాముగండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలు పునిచ్చారు.

పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి

పాలకుర్తి,సెప్టెంబర్‌ 17: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని, కారు గుర్తు కు ఓటు వేసి రామగుండంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని రాముగండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలు పునిచ్చారు. ఆదివారం తక్కళ్లపల్లి సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జయ్యారం గ్రామానికి చెందిన అడ్వ కేట్‌ పొన్నవేణి మనోహర్‌, బీసి సంఘం అధ్యక్షుడు బీస్పెల్లి లింగయ్య తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు ఇంజపురి నవీన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో నాయకులు కౌశిక్‌ హరి, వైస్‌ఎంపీపీ ఎర్రం స్వామి, రామగుండం నగర డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, సర్పంచ్‌లు కోల లత, మల్లెత్తుల శ్రీనివాస్‌, కట్టెకోళ వేణుగోపాల్‌రావు, మేరుగు పోచం, షేర్ల లక్ష్మిపతి, కోండ్ర చంద్రయ్య, కొప్పు పుష్పలత, ధరని రాజేష్‌, కార్పొరేటర్‌ బాల రాజుకుమార్‌, కౌశిక్‌ లత, నాయకులు తంగెడ అనీల్‌రావు, పున్నం సాగర్‌, చంద్రయ్య, శ్రీపతి శంకరయ్య, మాదాసు రామూర్తి, యాదగిరిగౌడ్‌, సర్వర్‌, జేవి రాజు, అల్లం రాజయ్య, ముల్కళ్ల కొమురయ్య, సందెల మల్లయ్య, దేవి లక్ష్మినర్సయ్య, బండి శ్రీనివాస్‌, సతీష్‌, రవికుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పుట్నూర్‌కు చెందిన కొడిపెల్లి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Updated Date - 2023-09-18T00:43:38+05:30 IST