ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2023-01-14T00:18:35+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై విధిస్తున్న ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
గణేశ్‌నగర్, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై విధిస్తున్న ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల్లో ఏసీడీ చార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి నిత్యం ఏదో ఒక రూపంలో చార్జీల పేరుతో వేలరూపాయలు వసూలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైందన్నారు. విద్యుత్ వినియోగదారులపై అయిదు వందల నుంచి ఐదు వేల వరకు భారం పడుతోందని, ఇది రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన సంక్రాంతి పండుగ కానుకనా అని ఎద్దేవా చేశారు. అనంతరం ఎస్‌ఈకి వినతిపత్రం ఆందజేశారు. కార్యక్రమంలో బానోతు శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, దండి రవీందర్, బాలబద్రి శంకర్, షబానా మహమ్మద్, సలీముద్దీన్, జీడీ రమేష్, మామిడి సత్యనారాయణరెడ్డి, ముక్క భాస్కర్, మెతుకు కాంతయ్య పాల్గొన్నారు.