గెలుపు కోసం సంఘటితంగా కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-11-21T00:16:04+05:30 IST
రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీని అధికా రంలోకి తీసుకువచ్చేందుకు మండలంలోని కార్యకర్తలందరు సంఘటితంగా తన గెలుపుకోసం కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

- బీఆర్‌ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
జూలపల్లి, నవంబరు 20 : రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీని అధికా రంలోకి తీసుకువచ్చేందుకు మండలంలోని కార్యకర్తలందరు సంఘటితంగా తన గెలుపుకోసం కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం బీఆర్‌ఎస్ మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మోసపూ రిత పథకాలపై ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసేందు కు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్‌నేత, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనర్సయ్య, ఎంపీపీ రమాదేవి, నాయకులు కంది చొక్కారెడ్డి, పుల్లూరి శ్రీనివాస్ రావు, నల్ల మనోహర్‌రెడ్డి, నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.