సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-06-03T00:46:42+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకం

గోదావరిఖని, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సిం గ్‌ రాజ్‌ఠాకూర్‌ హాజరై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శివాజీనగర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని సో నియగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం సకల జనుల పోరాటం మరువలేనిదని, సింగరేణి కార్మికులు 45రోజులు సమ్మె చేసి తెలంగాణను సాధించుకున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు, నియామకాలు జరుగుతాయనుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, పేద ప్రజల బ్ర తుకులు మారుతాయని ఆకాంక్షిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం వాటికి విరుద్ధంగా పరిపాలన చేస్తుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే అమరుల కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నెలకు రూ.25వేల పెన్షన్‌ ఇవ్వడంతో వారిని గౌరవించుకోవ డం జరుగుతుందన్నారు. అమరుల ఆశయ సాధనను కొనసాగించాలని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వా మి, ఎండీ ముస్తాఫా, గాదం విజయ, నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, పెద్దె ల్లి ప్రకాష్‌, నాజీమ్‌, కొప్పుల శంకర్‌, నగునూరి రాజు, తిప్పారపు శ్రీనివాస్‌, లచ్చన్న, దూళికట్ట సతీష్‌, దాసరి విజయ్‌, రాజు, వీరబోయిన రవికుమార్‌, సింహాచలం, యాకూబ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:46:42+05:30 IST