ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

ABN , First Publish Date - 2023-06-03T00:30:08+05:30 IST

మల్లాపూర్‌ మండలంలో మూసివేసిన ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్ల జెండాలతో శుక్రవా రం నిరసన తెలిపారు.

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి
ముత్యంపేట షుగర్‌ఫ్యాక్టరీ ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

- నల్ల జెండాలతో కాంగ్రెస్‌ నాయకుల నిరసన

మల్లాపూర్‌, జూన్‌ 2: మల్లాపూర్‌ మండలంలో మూసివేసిన ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్ల జెండాలతో శుక్రవా రం నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గెలిచిన తరువాత షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని రైతులకు మాయ మాటలు చెప్పి నాలుగేళ్లు గడుస్తున్నామాట నిలుపుకోలేదన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ రైతులకు ఇచ్చిన హామీని నిలబె ట్టుకోవాలని లేకుంటే కల్వకుంట్ల కవితకు రైతులు బుద్ధి చెప్పినట్లు అర్వింద్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాష్ట్రంపైన చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చన తరువాత షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. నిరసన తె లిపిన వారిలో చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయ ణరెడ్డి, నాయకులు గోరుమంతుల ప్రవీణ్‌, కొమిరెడ్డి లింగారెడ్డి, కొత్తపల్లి రాజా రెడ్డి, బెజ్జారపు శ్రీనివాస్‌, అబ్ధుల్‌ హఫీజ్‌, అల్లూరి సురేందర్‌రెడ్డి, రాంప్రసాద్‌, కొంతం రాజం, మ్యాకల నర్సయ్య, కంభం సురేష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:30:08+05:30 IST