జేబీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-02-21T23:33:42+05:30 IST

జేబీసీసీఐ తదుపరి సమావేశం ఏర్పాటు చేయాలంటూ బీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట మహాధర్న నిర్వహించారు.

జేబీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, ఫిబ్రవరి 21: జేబీసీసీఐ తదుపరి సమావేశం ఏర్పాటు చేయాలంటూ బీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట మహాధర్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి జేబీసీసీఐ 11వ వేతన సమావేశం ఏర్పాటుచేయాలని, కార్మికులకు అలవెన్సులపై పూర్తిస్థాయిలోఒప్పందం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. సమావేశం జాప్యం చేయడం వల్ల పారిశ్రామిక ప్రశాంతతకు విఘాతం కలిగే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎం ఎస్‌ నాయకులు ఆకుల హరిణ్‌, సాయవేని సతీష్‌, మాదాసు రవీం దర్‌, పెండం సత్యనారాయణ, రాజేశం, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, గుండబోయిన భూమయ్య, నర్సింహులు, వెంకటేష్‌, బైర శ్రీనివాస్‌, నారాయ ణ, రాజు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:33:54+05:30 IST