ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలి

ABN , First Publish Date - 2023-06-18T23:27:10+05:30 IST

ఓటరు జాబితా ప్రకారం ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలి

కరీంనగర్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓటరు జాబితా ప్రకారం ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఆదివారం నగరంలోని పోచమ్మవాడ 39వ వార్డు, ఎలగందల్‌ ఓటరు జాబితా ఇంటింటి సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జాబితాలోని వివరాల ప్రకారం ఇంటి నంబర్‌, కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, తహసిల్దార్‌ వెంకట్‌ రెడ్డి, బూత్‌ లెవల్‌ అధికారులు పాల్గొన్నారు.

- కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కరీంనగర్‌ టౌన్‌: కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. కేబుల్‌ బ్రిడ్జిని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్టేజీ ఏర్పాటు నుంచి పార్కింగ్‌ వరకు ప్రతి ఒక్కటి పకడ్బందీగా జరగాలని సూచించారు. కార్యక్రమంలో సీపీ సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, ఏసీపీ తుల శ్రీనివాస్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:27:10+05:30 IST