Share News

Kachiguda: కాచిగూడ స్టేషన్‌కు ఐజీబీసీ ప్లాటీనం ర్యాంక్‌ అవార్డ్‌

ABN , First Publish Date - 2023-11-24T11:42:07+05:30 IST

నగరంలో చారిత్రాత్మకమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌(Kachiguda Railway Station)కు ప్లాటినం ర్యాంక్‌ అవార్డ్‌-2023 లభించింది.

Kachiguda: కాచిగూడ స్టేషన్‌కు ఐజీబీసీ ప్లాటీనం ర్యాంక్‌ అవార్డ్‌

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నగరంలో చారిత్రాత్మకమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌(Kachiguda Railway Station)కు ప్లాటినం ర్యాంక్‌ అవార్డ్‌-2023 లభించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్ఫరెన్స్‌ (ఐజీబీసీ) ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తుంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పర్యావరణం, ప్లాస్టిక్‌ నిషేధం, పరిశుభ్రత, డస్ట్‌బిన్‌ల ఏర్పాటు, పచ్చదనం వంటి వాటిపై ఐజీబీసీ ఈ అవార్డును ప్రకటించింది. ఇదే సంస్థ 2018లో గోల్డ్‌ ర్యాంక్‌ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డ్‌ రావడంపై డీఆర్‌ఎం లోకేష్‌ వైష్ణోయ్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ అవార్డ్‌ సాధించిన రైల్వే స్టేషన్లలో కాచిగూడ రెండవది కావడం గమనార్హం. ఈ అవార్డ్‌ను చెన్నైలో జరిగే కార్యక్రమంలో ఐజీబీసీ నుంచి రైల్వే అధికారులు అందుకోనున్నారు.

ddd.jpg

Updated Date - 2023-11-24T11:42:09+05:30 IST