K Viswanath: ముగిసిన కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-02-03T15:47:17+05:30 IST

సంప్రదాయాల ప్రకారం దర్శకుడు కె. విశ్వనాథ్‌ (K. Viswanath) అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట (Panjagutta) శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు..

K Viswanath: ముగిసిన కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

హైదరాబాద్: సంప్రదాయాల ప్రకారం దర్శకుడు కె. విశ్వనాథ్‌ (K. Viswanath) అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట (Panjagutta) శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. కనసారిగా విశ్వనాథ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అంతకుమందు ఫిలిం చాంబర్‌ (Film Chamber)లో విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌.(K. Viswanath passed away) గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

తెలుగు చిత్ర రంగంలో విశ్వనాథ్‌ది విలక్షణ పాత్ర. తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన.. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రాన్ని కొలమానంగా తీసుకుని సినీ పరిశ్రమలో ‘శంకరాభరణం’ కంటే ముందు, ఆ తర్వాత చిత్రాలుగా విశ్లేషించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 1992లో విశ్వనాథ్‌కు పదశ్మీ పురస్కారంతో సత్కరించారు. 2016లో ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke Award) దక్కింది. సీఎన్‌ఎన్ ఐబీఎన్ ప్రకటించిన వంద భారతీయ ఉత్తమ చిత్రాల్లో విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం, సారగసంగమం చిత్రాలుండడం విశేషం.

Updated Date - 2023-02-03T15:48:45+05:30 IST