కేంద్ర సర్వీసులకు యోగితా రాణా
ABN , First Publish Date - 2023-04-20T03:14:42+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.
కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ
జాయింట్ సెక్రటరీగా నియామకం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ జాయుంట్ సెక్రటరీగా నియమితులు కానున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా గతంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో విశాఖపట్నంలో ఐఏఎస్ శిక్షణ పూర్తిచేశారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించారు. ఈమె స్వస్థలం జమ్మూ. ఈమె భర్త మాణిక్కరాజ్ కణ్ణన్ కూడా ప్రస్తుతం కేంద్ర సర్వీసులోనే విధులు నిర్వహిస్తున్నారు. 2017లో సంగారెడ్డి కలెక్టర్‌గా, అనంతరం తెలంగాణ అడిషనల్ ఎన్నికల అధికారిగా పనిచేశారు.