నీట్‌గా ప్యాక్ చేసిన గోనెసంచి.. విప్పి చూసి షాకైన తుక్కుగూడ వాసులు

ABN , First Publish Date - 2023-04-12T11:46:38+05:30 IST

తుక్కుగూడ వాసులకు నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న ఒక గోనెసంచి కనిపించింది. అది ఏమై ఉంటుందా? అని విప్పి చూసి స్థానికులు షాక్ అయ్యారు.

నీట్‌గా ప్యాక్ చేసిన గోనెసంచి.. విప్పి చూసి షాకైన తుక్కుగూడ వాసులు

హైదరాబాద్ : తుక్కుగూడ వాసులకు నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న ఒక గోనెసంచి కనిపించింది. అది ఏమై ఉంటుందా? అని విప్పి చూసి స్థానికులు షాక్ అయ్యారు. దానిలో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహం కనిపించింది. తుక్కుగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. గోనె సంచిలో మహిళ మృతదేహాన్ని ప్యాక్ దుండగులు పడేసి వెళ్లిపోయారు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని పహడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సదరు మహిళ మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. మహిళ మృతదేహం లభ్యంపై ఏసీపీ అంజయ్య మాట్లాడుతూ.. ఎరుపు రంగు చీరలో మహిళ మృతదేహం కనిపించిందన్నారు. మహిళా మెడలో దారంతో ఉన్న తాళిబొట్టు ఉందన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి వయసు 30-35 ఉంటుందన్నారు. బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉందన్నారు. మృతురాలు ఎవరు అనేది గుర్తించడం కష్టంగా ఉందన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీపీ అంజయ్య తెలిపారు.

Updated Date - 2023-04-12T11:46:38+05:30 IST