కోహెడలో హోల్‌సేల్ చేపల మార్కెట్: తలసాని
ABN , First Publish Date - 2023-01-07T03:20:36+05:30 IST
రంగారెడ్డి జిల్లా కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్‌ను నిర్మించనున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్‌ను నిర్మించనున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మత్స్య, డెయిరీ, పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోహెడలో కోల్డ్‌స్టోరేజీ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాల్లో గొర్రెల, మేకల మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.19 కోట్లతో 57 ఎకరాల విస్తీర్ణంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన తెలిపారు.