అంబర్‌పేటకు ఏం చేశారు..
ABN , First Publish Date - 2023-02-06T00:11:12+05:30 IST
అంబర్‌పేటకు ఏం చేశారు.. కేంద్రమంత్రికి ఎమ్మెల్యే వెంకటేశ్ సూటిప్రశ్న నల్లకుంట/రాంనగర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : గత 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మూడేళ్లపాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించిన జి.కిషన్‌రెడ్డికి మెజారిటీని ఇచ్చిన అంబర్‌పేట నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూటిగా ప్రశ్నించారు. ఎంపీ నిధులను ఆయన ఖర్చు చేయకపోవడంతో అవి మురిగిపోతున్నాయన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజు పార్టీ పదవికి రాజీనామాచేసి తన అనుచరులతో కలిసి ఆదివారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పార్టీ కండువాలుకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ కిషన్‌రెడ్డికి కేంద్రం కేటాయించే నిధులలో అంబర్‌పేట నియోజకవర్గానికి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. బీఆర్‌ఎ్‌సలో చేరినవారిలో ఎ.రాములు, ఎం.రాజు, కె.రాజు, టీవీ శేఖర్, శ్రావణ్, శివ, మురళి, శేఖర్, ప్రణయ్, అరవింద్, ప్రసాద్, కుమార్, మల్లేష్, వెంకటచారి తదితరులున్నారు.
నల్లకుంట/రాంనగర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : గత 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మూడేళ్లపాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించిన జి.కిషన్‌రెడ్డికి మెజారిటీని ఇచ్చిన అంబర్‌పేట నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూటిగా ప్రశ్నించారు. ఎంపీ నిధులను ఆయన ఖర్చు చేయకపోవడంతో అవి మురిగిపోతున్నాయన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజు పార్టీ పదవికి రాజీనామాచేసి తన అనుచరులతో కలిసి ఆదివారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పార్టీ కండువాలుకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ కిషన్‌రెడ్డికి కేంద్రం కేటాయించే నిధులలో అంబర్‌పేట నియోజకవర్గానికి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. బీఆర్‌ఎ్‌సలో చేరినవారిలో ఎ.రాములు, ఎం.రాజు, కె.రాజు, టీవీ శేఖర్, శ్రావణ్, శివ, మురళి, శేఖర్, ప్రణయ్, అరవింద్, ప్రసాద్, కుమార్, మల్లేష్, వెంకటచారి తదితరులున్నారు.