ప్రపంచాన్ని శాసిస్తాం

ABN , First Publish Date - 2023-02-21T01:08:30+05:30 IST

క్రీడల్లో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతాం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయింపు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రపంచాన్ని శాసిస్తాం బర్కత్‌ఫుర, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో భారత్‌ క్రీడలతో ప్రపంచాన్ని శాసించనున్నదని కేం ద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. క్రీడా రంగానికి మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరిం చారు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో నిధులు పెంచామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఖేలో తెలంగాణ... జీతో తెలంగాణ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ముందుగా పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. నిజాం కళాశాల మైదానంలో ఖేలో సికింద్రాబాద్‌... జీతో సికింద్రాబాద్‌ క్రీడా పోటీలను సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 క్రీడా మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, వాలీబాల్‌, రన్నింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏడు వేల మంది క్రీడాకారులు, 400 క్రికెట్‌ జట్లు, 200 కబడ్డీ టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. విజేతలకు రూ. 25 లక్షల నగదు బహుమతి, ప్రధాని ఫొటోతో ఉన్న సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. జర్నలిస్టులకు క్రికెట్‌ పోటీలు, కార్పొరేటర్లు, రాజకీయనాయకులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను శాలువా, మెమొంటోతో సత్కరించారు. పోటీల నిర్వహణపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభినందనలు తెలిపారు. ప్రముఖ గాయకురాలు మధుప్రియ పా టలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్‌, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగదీశ్వర్‌యాదవ్‌, బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచాన్ని శాసిస్తాం

బర్కత్‌ఫుర, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో భారత్‌ క్రీడలతో ప్రపంచాన్ని శాసించనున్నదని కేం ద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. క్రీడా రంగానికి మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరిం చారు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో నిధులు పెంచామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఖేలో తెలంగాణ... జీతో తెలంగాణ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ముందుగా పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. నిజాం కళాశాల మైదానంలో ఖేలో సికింద్రాబాద్‌... జీతో సికింద్రాబాద్‌ క్రీడా పోటీలను సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 క్రీడా మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, వాలీబాల్‌, రన్నింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏడు వేల మంది క్రీడాకారులు, 400 క్రికెట్‌ జట్లు, 200 కబడ్డీ టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. విజేతలకు రూ. 25 లక్షల నగదు బహుమతి, ప్రధాని ఫొటోతో ఉన్న సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. జర్నలిస్టులకు క్రికెట్‌ పోటీలు, కార్పొరేటర్లు, రాజకీయనాయకులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను శాలువా, మెమొంటోతో సత్కరించారు. పోటీల నిర్వహణపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభినందనలు తెలిపారు. ప్రముఖ గాయకురాలు మధుప్రియ పా టలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్‌, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగదీశ్వర్‌యాదవ్‌, బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T01:08:45+05:30 IST