Vijayashanthi : ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా

ABN , First Publish Date - 2023-05-20T12:35:30+05:30 IST

ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా హైదరాబాద్‌లోని నేటి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. ఆ శతాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన వారందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

Vijayashanthi : ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా

హైదరాబాద్ : ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా హైదరాబాద్‌లోని నేటి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. ఆ శతాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన వారందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నన్ను ఎంతో గౌరవించి... అమ్మా అని ఆదరాభిమానాలతో పిలుస్తూ, సమాజంపై కళాకారుల బాధ్యతను ప్రజాప్రాయోజిత చిత్రాలతో మరింత ఉన్నత స్థాయిలో మీరు నిలబెట్టగలరని ఆశీర్వదిస్తూ అభినందించి, కళ సమాజం కోసం, పేదవారి ప్రయోజనం కోసం... అని ఎన్టీఆర్ గారు చెప్పిన, స్ఫూర్తినిచ్చిన ఆ భావం. ఎమ్జీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వంటి ఎందరో సినిమా నుండి వచ్చిన నేతలు, భవిష్యత్ తరాలకు నిజాయితీతో నేర్పిన విధానాలు, తప్పనిసరిగా సినిమా కళాకారులం నిత్యసత్యాలుగా నమ్మి తీరుతం. మీరు నేర్పిన విలువల ప్రయోజనాలు నిలిచే విధంగా... ఎప్పటికీ.. అంతే కాదు... ‘తెలుగు తల్లికి పుత్రశోకం.. హితులారా ఇక సెలవు.. మహానేత కన్నుమూత.. అన్న రామన్నా... ఇక సెలవన్నా...’ వంటి1996 జనవరి 19 నాటి ముఖ్య తెలుగు దినపత్రికల ప్రధాన శీర్షికలను మీ అభిమానులు, తెలుగు ప్రజలందరూ భావోద్వేగభరితంగా ఇప్పటికీ గుర్తుగానే ఉంచుకుంటున్నారు... ఎప్పటికీ ఉంచుకుంటారు కూడా..’’ అని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-05-20T12:35:30+05:30 IST