ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం

ABN , First Publish Date - 2023-03-17T02:08:05+05:30 IST

ఎమ్మెల్యేల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా దేశపతి, చల్లా, నవీన్‌ ఎన్నిక

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పాలమూరి కమల నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌ నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయినట్లు వెల్ల్లడించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఉన్న ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారించిన రిటర్నింగ్‌ అధికారి.. వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నవీన్‌ కుమార్‌, దేశపతి శ్రీనివాస్‌, చల్లా వెంకట్రామిరెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.

Updated Date - 2023-03-17T02:08:05+05:30 IST