బస్సుల లైవ్ ట్రాకింగ్‌కు టీఎస్ ఆర్టీసీ యాప్
ABN , First Publish Date - 2023-01-14T03:08:17+05:30 IST
ప్రయాణికులు తాము రిజర్వు చేసుకున్న బస్సు ఎక్కడ ఉందో, తమ వద్దకు ఏ సమయానికి చేరుకుంటుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు తాము రిజర్వు చేసుకున్న బస్సు ఎక్కడ ఉందో, తమ వద్దకు ఏ సమయానికి చేరుకుంటుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందస్తు బుకింగ్ చేసుకునే ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్ లింక్ కూడా సందేశం రూపంలో వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 1800 బస్సు సర్వీ్‌సలకు బస్సు ట్రాకింగ్ సదుపాయం కల్పించామని, త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీ్‌సలతో సహా మిగిలిన బస్సులకూ ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఖీఖిఖఖీఇ ఆ్ఖఖి ఖీట్చఛిజుజీుఽజ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎ్‌సఆర్టీసీ వెబ్‌సైట్ ఠీఠీఠీ.్టటట్టఛి.్ట్ఛజ్చూుఽ్చజ్చుఽ్చ.జౌఠి.జీుఽ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.