గ్రేటర్‌లో ఏసీపీల బదిలీలు
ABN , First Publish Date - 2023-01-29T00:53:02+05:30 IST
గ్రేటర్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోని పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు.
హైదరాబాద్ సిటీ, జనవరి28 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోని పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు, సైబరాబాద్‌లో ముగ్గురు, రాచకొండలో ముగ్గురిని బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ డివిజన్ ఏసీపీగా రుద్రభాస్కర్, సంతో్‌షనగర్‌కు మహ్మద్ గౌస్, పంజగుట్టకు మోహన్‌కుమార్, మీర్‌చౌక్‌కు దామోదర్ రెడ్డి, మలక్‌పేటకు శ్యాంసుందర్‌ను నియమించారు. కొత్తగా నార్సింగి డివిజన్ ఏర్పాటు చేసి, హెచ్‌ఎండీఏ డీఎస్పీ రమణగౌడ్‌ను ఏసీపీగా నియమించారు. రాచకొండ పరిధిలో మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేశారు.