మే చివరిలోగా ‘మన బడి’ పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2023-03-19T01:01:42+05:30 IST

వచ్చే మే నెల చివరినాటికి ‘మన బస్తీ - మన బడి’ పనులను పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధికారులను ఆదేశించారు.

మే చివరిలోగా ‘మన బడి’ పనులు పూర్తిచేయాలి

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే మే నెల చివరినాటికి ‘మన బస్తీ - మన బడి’ పనులను పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధికారులను ఆదేశించారు. నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌లో శనివారం మన బస్తీ - మన బడి పనులపై హోం మంత్రి మహమూద్‌అలీ, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటే్‌షతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద ఆయా స్కూళ్లలో ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణం, భవనాలకు పెయింటింగ్‌, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సరఫరా, ఫర్నిచర్‌ ఏర్పాటు, గ్రీన్‌చాక్‌ బోర్డుల ఏర్పాటు పనులను చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ జిల్లాలోని 690 పాఠశాలల్లో మొదటి విడత కింద 239 స్కూళ్లను ఎంపిక చేసి రూ.44 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఎంపిక చేసిన 239 స్కూళ్లలో 198 చోట్ల మాత్రమే పనులు చేపట్టినట్లు తెలిపారు. విద్యాశాఖాధికారులను సమన్వయం చేసుకుని పనులను మరింత వేగవంతం చేసి మే చివరి నాటికి పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఇతరశాఖల అధికారులకు సూచించారు. సమీక్షలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:01:42+05:30 IST