సౌర విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.3.16
ABN , First Publish Date - 2023-01-13T03:56:37+05:30 IST
జెన్‌కోకు చెందిన పెద్దపల్లి మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న 4.6మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంట్ నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.3.16కు కొనుగోలు చేయాలని ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది.
అంగీకరించాలని ఈఆర్‌సీకి ఎన్పీడీసీఎల్ దరఖాస్తు
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జెన్‌కోకు చెందిన పెద్దపల్లి మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న 4.6మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంట్ నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.3.16కు కొనుగోలు చేయాలని ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఇందుకు అంగీకారం తెలపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 11గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ ఒప్పందంపై ఈనెల 30వతేదీ సాయంత్రం 5గంటల్లోగా సూచనలు/సలహాలు పంపించాలని ఈఆర్‌సీ కోరింది. దీనికి ఆమోదం లభిస్తే 25 ఏళ్లపాటు ఎన్పీడీసీఎల్ విద్యుత్తు కొనుగోలు చేయనుంది.