డ్రోన్‌ స్టార్టప్‌లకు టీహబ్‌ సహకారం

ABN , First Publish Date - 2023-02-07T00:45:29+05:30 IST

డ్రోన్‌ టెక్‌ యాక్సలరేటర్‌ కార్యక్రమంలో భాగంగా 10 డ్రోన్‌ స్టార్టప్‌ సంస్థలకు టీహబ్‌ సహకారం అందించనుందని టీహబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు.

డ్రోన్‌ స్టార్టప్‌లకు టీహబ్‌ సహకారం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డ్రోన్‌ టెక్‌ యాక్సలరేటర్‌ కార్యక్రమంలో భాగంగా 10 డ్రోన్‌ స్టార్టప్‌ సంస్థలకు టీహబ్‌ సహకారం అందించనుందని టీహబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. డ్రోన్‌ స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు టీహబ్‌, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎ్‌సఐసీ), అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), ఇంటెల్‌ సంయుక్త సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాక్సలరేటర్‌ కార్యక్రమం జూలై 2022లో ప్రారంభించగా దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, ముంబై, పాట్నా, బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన దాదాపు 300 డ్రోన్‌ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిలో 10 సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిపారు. లైవ్‌ రికార్డ్‌, ఫీడ్‌, 360 డిగ్రీ ఏరియల్‌ సర్వే, జియోస్పేషియల్‌ అనాలసిన్‌, డిఫెన్స్‌, నేషనల్‌ సెక్యూరిటీ, హెల్త్‌కేర్‌, పబ్లిక్‌ సేఫ్టీ, ట్రాన్స్‌పోర్టేషన్‌, ట్రాన్సిట్‌, సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ రంగాల్లో 10 స్టార్టప్‌ సంస్థలను ఎంపిక చేశారు. అకిన్‌ అనలిటిక్స్‌, డేబెస్ట్‌ రీసెర్చ్‌, డ్రాగో డ్రోన్స్‌, ఇండ్రోన్స్‌, ఓప్లస్‌ ఇన్నోవేషన్‌, సెన్స్‌కేర్‌ ల్యాబ్స్‌, వెక్టార్‌ టెక్నాలజీస్‌, వ్యోమిక్‌ డ్రోన్స్‌, యారాలావా టెక్నాలజీస్‌ సంస్థలను ఎంపిక చేశామని తెలిపారు. కొత్త ఉద్యోగాల కల్పన, సమస్యల పరిష్కారం, ఫండింగ్‌, సహకారం తదితర అంశాల్లో స్టార్ట్‌పలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. తెలంగాణ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాత తోటం మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో డ్రోన్‌ టెక్నాలజీ సహకారంతో పలు సమస్యలకు పరిష్కారం సూచించవచ్చన్నారు.

Updated Date - 2023-02-07T00:46:01+05:30 IST