యథాతథ స్థితి అంటే అక్రమ నిర్మాణం కొనసాగింపు కాదు

ABN , First Publish Date - 2023-01-14T00:33:17+05:30 IST

యథాతథ స్థితి (స్టేటస్‌ కో) అంటే అక్రమ నిర్మాణం కొనసాగుతున్నా చూస్తూ ఊరుకోవాలని అర్థం కాదని హైకోర్టు స్పష్టంచేసింది.

యథాతథ స్థితి అంటే అక్రమ నిర్మాణం కొనసాగింపు కాదు

  • హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): యథాతథ స్థితి (స్టేటస్‌ కో) అంటే అక్రమ నిర్మాణం కొనసాగుతున్నా చూస్తూ ఊరుకోవాలని అర్థం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. దిగువ కోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చిందనే కారణంతో అక్రమ నిర్మాణం పూర్తి చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదని పేర్కొంది. హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన ప్రైవేటు వ్యక్తులకు అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తామని జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులపై వారు సివిల్‌ కోర్టును ఆశ్రయించి స్టేటస్‌ కో ఆదేశాలు తెచ్చుకున్నారు. స్టేట్‌సకో అమలులో ఉండగానే అక్రమ నిర్మాణాలను కొనసాగించారు. అక్రమ నిర్మాణాలతో ఇబ్బంది పడుతున్న పలువురు హైకోర్టును ఆశ్రయించారు. స్టేటస్‌ కో అంటే ఆ ఆదేశాలు జారీచేసిన రోజున ఉన్న పరిస్థితిని కొనసాగించాలే తప్ప నిర్మాణాలను కొనసాగించడం కాదని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేస్తూ పిటిషన్‌ను ముగించింది.

Updated Date - 2023-01-14T00:33:18+05:30 IST