చోరీలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2023-01-14T23:51:09+05:30 IST
సంక్రాంతికి నగరంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు స్వస్థలాలకు వెళ్లారు.
సైకిళ్లపై యువత, పోలీసుల పెట్రోలింగ్
మియాపూర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి నగరంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎటువంటి దొంగతనాలు, అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో ఆయా కాలనీల్లో పర్యటించి స్థానికులకు అవగాహన కల్పించారు. మియాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో డీసీపీ స్థానిక యువకులు, సిబ్బందితో కలిసి సైకిల్‌పై పెట్రోలింగ్ నిర్వహించారు. కాలనీల్లోని యువతను గ్రూపులుగా ఏర్పాటు చేసి రాత్రి సమయంలో సైకిళ్లపై గస్తీకాసేలా వారికి అవగాహన కల్పించారు. సొంతూళ్లకు వెళ్లిన వారి ఇళ్లవద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
మియాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో కరపత్రాలు ముద్రించి ఆయా కాలనీలు, బస్తీలలో పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అపార్టుమెంటులు, కాలనీల్లో వాచ్‌మన్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, నిర్మానూష్య ప్రాంతాల్లో, తాళాలు వేసివున్న ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.