ఏప్రిల్‌లో సదరన్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2023-02-21T03:21:35+05:30 IST

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఏప్రిల్‌లో జరగనుంది.

ఏప్రిల్‌లో సదరన్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఏప్రిల్‌లో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించడానికిగానూ ఎజెండా అంశాలను పంపాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు రాష్ట్రానికి సోమవారం లేఖ రాసింది. ఇందులో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవాటిని సదరన్‌ కౌన్సిల్‌కు నివేదిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎజెండా అంశాలను వెంటనే సదరన్‌ కౌన్సిల్‌ సెక్రటరియేట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలని కోరింది. వీటితో పాటు ఇది వరకే కౌన్సిల్‌ చర్చించిన సమస్యలను, వాటి పురోగతికి సంబంధించి వివరణలను కూడా పంపాలని తెలిపింది.

Updated Date - 2023-02-21T03:21:35+05:30 IST