జీఓ 59 సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2023-03-05T00:41:35+05:30 IST

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో 59జీఓ కింద దరఖాస్తు చేసు కున్న వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు.

జీఓ 59 సమస్యలు పరిష్కరించండి

ఎల్‌బీనగర్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో 59జీఓ కింద దరఖాస్తు చేసు కున్న వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ను కలిసిన ఆయన 59 జీఓ దరఖాస్తుదా రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దర ఖాస్తుదారులకు పంపిన నోటీసుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు పేర్కొంటు లక్షల రూపాయలు కట్టాలని పే ర్కొంటూ పంపారన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే బస్తీలో వరుసగా ఉన్న ఇళ్లవారు దరఖాస్తు చేసుకుంటే మొదటి ఇంటికి రూ.15లక్షలు, రెండో ఇంటికి రూ. 10లక్షలు, మూ డో ఇంటికి రూ.5లక్షలు, నాలుగో ఇంటికి రూ.3లక్షలు కట్టమని నోటీసులు వచ్చాయన్నారు. ఈ విధంగా ఒకే వరుసలో ఉన్న నాలుగు ఇళ్లకు వేర్వేరుగా రావడమేమి టని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన కలెక్టర్‌ కు వివరించారు. స్పందించిన కలెక్టర్‌ వాటిపై పూర్తిస్తా యి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌రెడ్డి పలు కాలనీల వాసులున్నారు.

Updated Date - 2023-03-05T00:41:35+05:30 IST