ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్రమే నిధులిస్తోంది

ABN , First Publish Date - 2023-03-26T02:18:28+05:30 IST

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌...

ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్రమే నిధులిస్తోంది

కేంద్రం నిధులు వాడుకుంటూ నిందలా?: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/ అడ్డగుట్ట, మార్చి 25(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌... కేంద్రంపై విమర్శలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయడం లేదంటూనే రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫ(రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి) నుంచి సాయాన్ని అందిస్తామని చెప్పారన్నారు. వాస్తవానికి ఈ ఎస్‌డీఆర్‌ఎ్‌ఫలో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అకౌంట్‌లో రూ.608.06 కోట్లు ఉన్నాయని తెలిపారు. అంటే ఇప్పుడు నష్టపోయిన రైతుల పరిహారానికి సరిపడా నిధులున్నాయని వివరించారు. కాగా, దేశంతోపాటు కోర్టులు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను అగౌరవపర్చడం నెహ్రూ కుటుంబానికి అలవాటైందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ఇందిరాగాంధీపై అనర్హత వేటు వేస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిస్తే... దానిని జీర్ణించుకోలేని ఇందిర ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. అదే వారసత్వాన్ని రాహుల్‌గాంధీ తాజాగా నిరూపించారన్నారు. కాగా, అవినీతి అక్రమాలకు తెలంగాణ కేరా్‌ఫగా మారిందని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పోవాలని కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అడ్డగుట్ట డివిజన్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఓక్క రేషన్‌ కార్డు జారీ చేయలేదని తెలిపారు.

Updated Date - 2023-03-26T02:18:28+05:30 IST