Jubilee Bus Station: జేబీఎస్‌లో సంక్రాంతి రద్దీ

ABN , First Publish Date - 2023-01-11T10:55:38+05:30 IST

సంక్రాంత్రి పండుగ నేపథ్యంలో జూబ్లీబ్‌సస్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల

Jubilee Bus Station: జేబీఎస్‌లో సంక్రాంతి రద్దీ

హైదరాబాద్/మారేడుపల్లి: సంక్రాంత్రి పండుగ నేపథ్యంలో జూబ్లీబ్‌సస్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నెల 7 నుంచి 15 వరకు అదనంగా బస్సులను నడుపుతోంది. నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది బస్సుల ద్వారా ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్లాట్‌ఫాంల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాలతో పాటు, ఏపీకి, ముంబై, బెంగళూర్‌ వంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-01-11T10:55:46+05:30 IST