సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించిన సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా

ABN , First Publish Date - 2023-03-19T00:20:08+05:30 IST

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా బంజరాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న సాంద్ కలెక్షన్స్‌లో స్ప్రింగ్ సమ్మర్ 2023

సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించిన సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా

హైదరాబాద్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా బంజరాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న సాంద్ కలెక్షన్స్‌లో స్ప్రింగ్ సమ్మర్ 2023 నూతన కలెక్షన్స్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టోర్ నిర్వహకులు వైభవ్ షరీఫ్ మరియు నిరాలి మాట్లాడుతూ.. సంప్రదాయాలు మరియు ఆధునికత యొక్క సంపూర్ణ కలయికతో ఏర్పాటు చేసిన సౌంద్ బ్రాండ్‌కు ఇది 24వ స్టోర్. 900 చ.అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్.. డిజైనర్ మహిళల దుస్తుల కోసం ఒక-స్టాప్ గమ్యస్థానంగా ఉంది. అనేక రకాల కుర్తా సెట్‌లు, ట్యూనిక్స్, డ్రెస్‌లు, చీరలు, లెహంగాలు అన్నీ సరికొత్త వెరైటీస్ ఇక్కడ లభిస్తాయి. సమకాలీన స్టోర్ ఆధునిక-రెట్రో విధానాన్ని కలిగి ఉంది. నగరం యొక్క వారసత్వం మరియు ప్రపంచ బ్రాండ్ తత్వాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ ను ఏర్పాటు చేశాం అని తెలిపారు.

Anam-Mirza.jpg

సరికొత్త స్ప్రింగ్ సమ్మర్ 2023 సేకరణ.. దేర్ షీ గోస్, కళ మరియు ప్రకృతి యొక్క సమ్మేళనానికి సంబంధించినది. మన చుట్టూ ఉన్న రంగులు, అడవి నుండి ప్రేరణ పొంది ఈ సీజన్ ప్రింట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగానూ.. స్కర్టులు, టాప్‌లు, డ్రెస్‌లు, జంప్‌సూట్‌లు, సులభమైన ట్యూనిక్ సెట్‌లు మరియు పూల చీరల లైట్ సిల్హౌట్‌ల శ్రేణిలో రూపొందించబడిన బోల్డ్, వైవియస్ రంగుల సంకలనం ఈ స్ప్రింగ్ సమ్మర్ 2023 కలెక్షన్స్ ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-19T00:20:08+05:30 IST