Saidabad: హవాలా డబ్బు స్వాధీనం
ABN , First Publish Date - 2023-01-31T09:45:51+05:30 IST
హవాలా మార్గంలో నగదును(Hawala money) తరలిస్తున్న ఒకరిని సైదాబాద్ పోలీసులు(Saidabad Police) అదుపులోకి
Hyderabad/Saidabad: హవాలా మార్గంలో నగదును(Hawala money) తరలిస్తున్న ఒకరిని సైదాబాద్ పోలీసులు(Saidabad Police) అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు లేని రూ.86 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఎన్. మనోజ్(30) సోమవారం మధ్యాహ్నం లక్ష్మీనగర్ కాలనీలోని నరేష్ నుంచి రూ.86 లక్షల నగదును తీసుకుని యాక్టివా బైక్‌లో పెట్టుకుని వెళ్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సైదాబాద్ పోలీసులు ధోబీఘాట్ చౌరస్తాలో తనిఖీ చేయడంతో నగదు పట్టుబడింది. డబ్బులకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో అతడితో పాటు, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఐటీ అధికారులకు అప్పగించినట్లు డీఐ చంద్రమోహన్ వివరించారు. రాణిగంజ్‌లోని బంగారు, రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారైన యజమాని ఆదేశాల మేరకు డబ్బు తీసుకెళ్తున్నట్లు మనోజ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.