దుమ్ములేపుతున్న దమ్మున్న చానల్‌

ABN , First Publish Date - 2023-06-10T03:46:27+05:30 IST

ఒక్క చాన్స అంటూ ప్రజల్లోకి వెళ్లి వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగనకు ఊహించని షాక్‌ తగిలింది.

దుమ్ములేపుతున్న దమ్మున్న చానల్‌

యూట్యూబ్‌లో ‘ఏబీఎన ఆంధ్రజ్యోతి’

డిజిటల్‌ చానల్‌ హవా

న్యూస్‌ చానల్స్‌ రేటింగ్‌లో

జాతీయ స్థాయిలో నాలుగో స్థానం

హైదరాబాద్‌, జూన 9(ఆంధ్రజ్యోతి): ఒక్క చాన్స అంటూ ప్రజల్లోకి వెళ్లి వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగనకు ఊహించని షాక్‌ తగిలింది. ‘ఏబీఎన ఆంధ్రజ్యోతి’ చానల్‌ను బ్యాన చేస్తే తాను ఏం చేసినా తెలియదని, తన కూలీ మీడియాతో మభ్యపెట్టవచ్చని భావించిన జగనకు ఆంధ్రప్రదేశ ప్రజలు mఝలక్‌ ఇచ్చారు. కేబుల్‌ కనెక్షన్ల ద్వారా రాకపోయినా వాస్తవాలను తెలుసుకునేందుకు ఏబీఎన ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను యూట్యూబ్‌లో ఆదరిస్తున్నారు. జగన సర్కారు ఎన్ని కుట్రలు చేసినా తాము మాత్రం దమ్మున్న చానల్‌ ఏబీఎన ఆంధ్రజ్యోతిని చూస్తామని తేల్చిచెప్పారు. ఏపీలో ఏబీఎన ఆంధ్రజ్యోతి చానల్‌ను కేబుల్‌ కనెక్షన్ల ద్వారా ప్రజలు వీక్షించకుండా వైసీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. అయితే డీటీహెచల ద్వారా ప్రజలు చూస్తున్నారు. అలాగే ఏబీఎన ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షిస్తున్నారు. దీంతో వాస్తవిక సమాచారాన్ని నిరంతరాయంగా అందిస్తూ తెలుగు ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించింది.

యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షిస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచింది. యూట్యూబ్‌ డేటా ప్రకారం.. గతంతో పోల్చితే ఏకంగా 20 స్థానాలు మెరుగుపడి 4వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు జీ న్యూస్‌, ఆజ్‌ తక్‌, టీవీ9 మరాఠీ తర్వాత ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానలే ఉంది. అత్యధికంగా వీక్షించే ఛానళ్ల సరసన నిలిపి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని తెలుగు ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ ర్యాంకింగ్‌ సాక్ష్యంగా నిలిచింది. దమ్మున్న ఛానల్‌గా ఏబీఎన్‌ యూట్యూబ్‌ వేదికగా దుమ్మురేపడంలో తెలుగు వీక్షకుల తోడ్పాటు మరువలేనిది. జగన సర్కారు కేబుల్‌ కనెక్షన్లలో ఏబీఎన ఆంధ్రజ్యోతి చానల్‌ రాకుండా చేయడం ద్వారా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలతో పాటు ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియకుండా కట్టడి చేయాలని చూస్తోంది. దీంతో ప్రజలు యూట్యూబ్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను వీక్షించి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. బహిరంగ సభల్లో అదే పనిగా ఏబీఎన ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కే జగన ఏపీలో విధించిన బ్యాన్‌ వల్ల సాధించిదేమీ లేదని, తన చేష్టలతో ఏబీఎన ఆంధ్రజ్యోతిని ఇంకా బలోపేతం చేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-06-10T03:46:27+05:30 IST