Share News

Michaung Cyclone: తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన..

ABN , First Publish Date - 2023-12-05T11:12:48+05:30 IST

భాగ్యనగరంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నగరాన్ని రెండు రోజులుగా ముసురు వీడటం లేదు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నేడు గ్రేటర్‌లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ చేశారు.

Michaung Cyclone: తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన..

హైదరాబాద్ : భాగ్యనగరంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నగరాన్ని రెండు రోజులుగా ముసురు వీడటం లేదు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నేడు గ్రేటర్‌లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్ సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Updated Date - 2023-12-05T11:12:51+05:30 IST