New Year: న్యూ ఇయర్ టైం.. నార్కోటిక్ పోలీసుల సరికొత్త స్టెప్.. డ్రగ్స్ తీసుకుంటే దొరకడం పక్కా..
ABN , Publish Date - Dec 30 , 2023 | 10:16 AM
ఇయర్ ఎండ్‌కు కొన్ని గంటలే సమయం ఉంది. ఇక న్యూయర్ సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటుతాయి. మందుబాబులకు పండగే. ఎంత తాగుతారో.. ఏం తాగుతారో తెలియకుండా తాగేస్తారు. ఇక డ్రగ్స్ కూడా అంతే. ఇష్టానుసారంగా వినియోగిస్తారు. ఇక డ్రగ్స్ తీసుకుంటే మాత్రం పోలీసులకు ఇట్టే దొరికిపోతారు.
హైదరాబాద్: ఇయర్ ఎండ్‌కు కొన్ని గంటలే సమయం ఉంది. ఇక న్యూయర్ సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటుతాయి. మందుబాబులకు పండగే. ఎంత తాగుతారో.. ఏం తాగుతారో తెలియకుండా తాగేస్తారు. ఇక డ్రగ్స్ కూడా అంతే. ఇష్టానుసారంగా వినియోగిస్తారు. ఇక డ్రగ్స్ తీసుకుంటే మాత్రం పోలీసులకు ఇట్టే దొరికిపోతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు చేయడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యమని నార్కోటిక్ బ్యూరో అంటోంది. ఒక్కో కమిషనరేట్‌కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు సప్లై చేయడం జరిగింది. ట్రై కమిషనరేట్ పరిధిలోని జంక్షన్ వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డ్రగ్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయ్యింది.