ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2023-01-25T10:41:57+05:30 IST

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు నిర్వహిస్తున్న దీక్షను హైదరాబాద్, బొల్లారం పోలీసులు భగ్నం చేశారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దీక్ష భగ్నం

హైదరాబాద్‌ : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు నిర్వహిస్తున్న దీక్షను హైదరాబాద్, బొల్లారం పోలీసులు భగ్నం చేశారు. గాంధీభవన్‌ దగ్గర అర్ధరాత్రి 2 గంటలకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ దగ్గరకు మీడియాను సైతం పోలీసులు అనుమతించలేదు. పోలీస్ స్టేషన్‌కు 300 మీటర్ల ముందు బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-25T10:41:57+05:30 IST