ఫూలే దంపతుల ఆశయాలను సాధించాలి

ABN , First Publish Date - 2023-03-19T00:38:47+05:30 IST

సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దళిత బహుజన సంఘాల ఆధ్వ ర్యంలో హయత్‌నగర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ఎమ్మెల్సీ దయానంద్‌తో కలిసి ఆవిష్కరించారు.

 ఫూలే దంపతుల ఆశయాలను సాధించాలి

హయత్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దళిత బహుజన సంఘాల ఆధ్వ ర్యంలో హయత్‌నగర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ఎమ్మెల్సీ దయానంద్‌తో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితమే సమాజ హితం కోసం ఆలోచించి ఆచరించిన గొప్ప వ్యక్తులు వారని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం యువత, మహిళలు నడుంబిగించాలన్నారు. భర్త ఫూలే ద్వారా చదు వు నేర్చుకుని అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు చదువును నేర్పించిన మహానీయురాలు సావిత్రి బాయి ఫూలే అన్నారు. అంబేడ్కర్‌ సైతం వారిని ఆదర్శంగా తీసుకు ని రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు పారంద స్వామి, ఎర్ర రవీందర్‌, నాయకులు చెన్న, జంగయ్య, మాజీ కార్పొరేటర్‌ లక్ష్మి ప్రసన్న, తిరుమల్‌రెడ్డి, నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, గజ్జి భాస్కర్‌యాదవ్‌, నక్క శ్రీనివాస్‌యాదవ్‌, ఉమేష్‌యాదవ్‌, భాస్కర్‌సాగర్‌, కళ్లెం సుజాతారెడ్డి, సీపీఐ నాయకులు రవీంద్రాచారి, శేఖర్‌రెడ్డి, కడారి పెంటయ్య, ఎర్ర గిరిబాబు, బాబురావు, బాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:38:47+05:30 IST