హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-05-27T03:40:06+05:30 IST

అమెరికా స్వాతంత్య్ర 247వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ను భారత్‌లోని యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ ప్రారంభం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎరిక్‌ గార్సెట్టి

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): అమెరికా స్వాతంత్య్ర 247వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ను భారత్‌లోని యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రాయబారి గార్సెట్టితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అమెరికా తరపున ఉన్నతస్థాయి దౌత్యవేత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా మొదటిసారి గార్సెట్టి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా యూఎస్‌ కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఎస్‌, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. గార్సెట్టి తన పర్యటనలో భాగంగా చౌమహల్లా ప్యాలెస్‌తో పాటు యూఎస్‌ మద్దతుతో నడుస్తున్న ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ని సందర్శించారు.

Updated Date - 2023-05-27T03:41:15+05:30 IST