వాణిజ్య భవనాలపై నజర్‌

ABN , First Publish Date - 2023-03-26T00:36:38+05:30 IST

జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం అధికారులు దుకాణాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, షాపింగ్‌ మాల్స్‌, కమర్షియల్‌ భవనాలతో పాటు గోదాముల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు.

వాణిజ్య భవనాలపై నజర్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం అధికారులు దుకాణాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, షాపింగ్‌ మాల్స్‌, కమర్షియల్‌ భవనాలతో పాటు గోదాముల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. స్ర్కాప్‌ (చెత్త, అట్టపెట్టెలు, ఇతర సామగ్రి), సిలిండర్లు, డెకరేషన్‌ మెటీరియల్స్‌, పేపర్స్‌, ఫార్మాస్యూటికల్‌ కెమికల్స్‌, నూనెలు, ప్లాస్టిక్‌, రబ్బర్‌ మెటీరియల్‌తో పాటు ఇతర వస్తువులు నిల్వ చేసిన గోదాములతో పాటు షాపులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 23 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న నిర్వాహకులు మూడు రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని, లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌ ఎన్‌.ప్రకా్‌షరెడ్డి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధ్దంగా సెల్లార్లలో గోదాములు నిర్వహిస్తూ, అక్రమంగా సామగ్రి నిల్వ చేసే వాణిజ్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిమాపక చర్యలు పాటించడంతో పాటు ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, పొగ డిటెక్టర్లను అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు.

పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నందుకు జరిమానా

ఫ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న కూకట్‌పల్లిలోని మంజీరా మెజిస్టిక్‌ మాల్‌ నిర్వాహకులకు రూ. 50 వేల జరిమానా విధించారు. ఫ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌, అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేకుండా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌.9లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. ఫ జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లే-ఔట్‌లోని రోడ్‌ నంబర్‌ 34 ప్లాట్‌ నంబర్‌ 413లోని ఖాళీ స్థలంలో ఆక్రమణలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించి తొలగించారు.

Updated Date - 2023-03-26T00:36:38+05:30 IST