సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌ భగవత్‌

ABN , First Publish Date - 2023-01-10T04:38:01+05:30 IST

రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ)చీ్‌ఫగా మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ బాధ్యతలు చేపట్టారు.

సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ)చీ్‌ఫగా మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ బాధ్యతలు చేపట్టారు. రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేష్‌ భగవత్‌ను ప్రభుత్వం ఇటీవల సీఐడీకి బదిలీ చేసింది. సోమవారం ఆయన సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే మహిళా భద్రత విభాగం చీఫ్‌గా షీకా గోయల్‌, శిక్షణ విభాగం ఐజీగా తరుణ్‌ జోషీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2023-01-10T04:38:02+05:30 IST