పవన్ నాయకత్వాన్ని బలపరుద్దాం
ABN , First Publish Date - 2023-01-15T01:50:42+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కాపులంతా కృషి చేయాలని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపునిచ్చారు.
కాపులకు సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపు
చెన్నై, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కాపులంతా కృషి చేయాలని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపునిచ్చారు. స్థానిక అంబత్తూర్‌లో శనివారం జరిగిన ‘కాపు సేవా సమితి’ సంక్రాంతి సంబరాల్లో ఏఎం రత్నం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెన్నై కేంద్రంగా గత 34 సంవత్సరాల్లో విజయవంతమైన పలు తెలుగు, తమిళం, హిందీ సినిమాలు తీశానని, ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు.