Hyderabad City: చిక్కిన వారి నుంచి అందినంత దోచుకోవడమే

ABN , First Publish Date - 2023-01-31T12:06:32+05:30 IST

ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు యువతులతో పాటు ఓ యువకుడిని

Hyderabad City: చిక్కిన వారి నుంచి అందినంత దోచుకోవడమే

ముఠాలుగా ఏర్పడి కొందరు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. ఉద్యోగాల పేరిట, రుణాలిస్తామంటూ టోకరా వేస్తున్నారు. ఇటువంటి రెండు గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు సైబరాబాద్‌ పోలీసులు.

Hyderabad City: ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు యువతులతో పాటు ఓ యువకుడిని సైబరాబాద్‌ సైబర్‌క్రైం, సైబర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీసీపీ కలమేశ్వర్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన సన్నీకుమార్‌ (22), నోయిడా నివాసి అర్చనా సింగ్‌ (27), గజియాబాద్‌ నివాసి రుచి భారతి (25), యూపీకి చెందిన శావిపాల్‌ (27), శాంతి (22), మీనా రాజ్‌పుత్‌ (24) ఽఢిల్లీలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ రికవరీ ఏజెన్సీ పేరిట కార్యాలయం తెరిచారు.

ఉద్యోగాల నిమిత్తం వెబ్‌ పోర్టళ్లలో బయోడేటాలను చూసి యువతను టార్గెట్‌ చేసేవారు. గ్యాంగ్‌లోని ఐదుగురు యువతులు ‘బహుళ జాతి కంపెనీల్లో మంచి జీతంతో ఉద్యాగాలు ఉన్నాయి’ అంటూ ఫోన్లు చేసేవారు. ఆసక్తి చూపిన వారి నుంచి రిజిస్ట్రేషన్‌, రెస్యూమ్‌ అప్‌డేట్‌, ఇంటర్వ్యూ నిర్వహణల నిమిత్తం ఖర్చులు అంటూ డబ్బు వసూలు చేసేవారు. నిరుద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ఆఫర్‌ లెటర్లు కూడా పంపించి, టెలిఫోన్‌ ఇంటర్వ్యూ చేసేవారు. బాధితులు పూర్తిగా తమ వలలో పడ్డాడని గుర్తించాక పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలను ఆశ చూపి అందిన కాడికి దోచేసేవారు. తర్వాత ఫోన్లు స్విచాఫ్‌ చేసేవారు. ఇలా మోసపోయిన దాదాపు 25 మంది సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో గతేడాది అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు.

మూడు కేసుల దర్యాప్తుతో..

నార్సింగి, చందానగర్‌, దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్లలో నమోదైన మూడు కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ గ్యాంగ్‌ మూలాలను గుర్తించారు. బాధితులు తెలిపిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో యూపీలోని నోయిడా, బిహార్‌లోని నలందా ప్రాంతాల్లో నిందితులు ఉన్నట్లు గుర్తించి దాడులు చేసి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 15 మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, 3 డెబిట్‌ కార్డులు, ఉద్యోగుల రిజిస్టర్‌ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-01-31T12:06:34+05:30 IST