సమాజానికి ముప్పుగా మానవ అక్రమ రవాణా
ABN , First Publish Date - 2023-06-07T04:42:52+05:30 IST
మానవ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా మారిందని డీజీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా మారిందని డీజీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా భద్రత విభాగం, బచ్‌పన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థతోపాటు ఇతర విభాగాలతో కలిసి ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ -రెస్క్యూ, పునరావాసం’పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. పోలీసు అకాడమీలో మంగళవారం జరిగిన ఈ సదస్సుకు డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా మారిందన్నారు. మానవ అక్రమ రవాణా కట్టడి చర్యలు తీసుకోవడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్పారు.