సీవీ ఆనంద్‌ భారీ శతకం

ABN , First Publish Date - 2023-02-21T01:24:46+05:30 IST

ఏ-3 డివిజన్‌ పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో సీవీ ఆనంద్‌ శతకంతో చెలరేగడంతో సికింద్రాబాద్‌ క్లబ్‌ భారీ విజయం సాధించింది.

సీవీ ఆనంద్‌ భారీ శతకం

‘సికింద్రాబాద్‌’ గెలుపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌): ఏ-3 డివిజన్‌ పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో సీవీ ఆనంద్‌ శతకంతో చెలరేగడంతో సికింద్రాబాద్‌ క్లబ్‌ భారీ విజయం సాధించింది. బాయ్స్‌టౌన్‌ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో సీవీ ఆనంద్‌ 151 (88 బంతుల్లో 11 ఫోర్లు, 12 సిక్సర్లతో) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సికింద్రాబాద్‌ క్లబ్‌ 35 ఓవర్లలో 4 వికెట్లకు 339 పరుగులు చేసింది. అనంతరం బాయ్స్‌టౌన్‌ కేవలం 25.1 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖలీల్‌ 3 వికెట్లు తీశాడు. కాగా సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో ఆనంద్‌ ఆడిన ఈ భారీ ఇన్నింగ్స్‌తో కలిపి మొత్తం 12 మ్యాచ్‌ల్లో 828 పరుగులు సాధించినట్టయింది. వీటిలో 5 అజేయ శతకాలున్నాయి. సగటు 119. అలాగే 7 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసి 11 వికెట్లు పతనం చేశాడు.

Updated Date - 2023-02-21T01:24:47+05:30 IST